హైదరాబాద్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. పోస్టింగ్‌లకు సంబంధించి ప్రాంతాలను ఎంపిక చేసుకొనేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.