Council Chairman Gutha | అభివృద్ధి పనులు కొనసాగాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Council Chairman Gutha | తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నర ఏండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha) అన్నారు. గురువారం దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న పోడు పట్టాల సమస్యలను పరిష్కరించి, పొడు భూములకు పట్టాలు ఇచ్చిన మహా నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు.

ఆలయ నిర్మాణానికి శంకుస్తాపన చేస్తున్న మండలి చైర్మన్ గుత్తా
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టాలి, అభివృద్ధి ఆగకుండా ఉండాలి అంటే మళ్లీ అధికార పార్టీనే ఆదరించాలని ఆయన సూచించారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే భాస్కర్ రావు చాలా అభివృద్ధి చేసారని మరోసారి ఆయనకు అవకాశం కల్పిస్తే.. ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

