తెలంగాణకు ‘మహా’ముప్పు!

- రాష్ట్రమంతటా మహారాష్ట్ర వేరియంట్
- రెట్టింపు వేగంతో వైరస్ వ్యాప్తి
- నేరుగా ఊపిరితిత్తులపైనే దాడి
- డబుల్ మాస్క్ తప్పనిసరి
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర వేరియంట్ గుబులు పుట్టిస్తున్నది. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం, సాధారణ లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం, నేరుగా ఊపిరితిత్తులపై ప్రతాపం చూపిస్తుండ టం ఆందోళన కలిగిస్తున్నది. గత మూడు రోజు ల్లో దేశంలో సేకరించిన నమూనాల్లో 60 శాతం మహారాష్ట్ర వేరియంట్ కనిపించిందని గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ఫ్లూయెంజా డాటా (జీఐఎస్ఏఐడీ) తెలిపింది.
రాష్ట్రమంతటా వ్యాప్తి
కొవిడ్‌లోని ‘బీ.1.617’ రకం వైరస్‌ను మహారాష్ట్ర వేరియంట్‌గా పిలుస్తారు. మహారాష్ట్ర సరిహద్దులోని నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో మొదట ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు గతంలో గుర్తించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ కేసు లు బయటపడ్డాయి. తాజాగా వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఏకంగా నాలుగింట మూడొంతుల నమూనాల్లో మహారాష్ట్ర వేరియంట్ కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. వరంగల్‌లో గత మూడు రోజుల్లో 75 నమూనాలు పరీక్షించగా మూడొంతుల్లో, వికారాబాద్‌లో 145 నమూనాలను విశ్లేషించగా.. 78 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ కనిపించింది. దీంతో ఈ వేరియంట్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
లక్షణాలు లేకుండానే దెబ్బతీస్తున్నది
గతంలో కరోనా వైరస్ శరీరంలోకి చేరిన తర్వా త 12 రోజులకు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి వ్యాధి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాతే ఊపిరితిత్తులపై ప్రభావం చూపేది. మహారాష్ట్ర వేరియంట్లో ఈ కాలవ్యవధి 8 రోజులకు తగ్గడంతోపాటు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. పైగా నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నది. సీటీ స్కాన్ చేస్తే తప్ప ఇది బయటపడటం లేదు. దీంతో చికిత్సకు ఆలస్యం అవుతున్నది. మరోవైపు మహారాష్ట్ర వేరియంట్ సోకినవారిలో వెన్నునొప్పి, ఒంటినొప్పులు, తలనొప్పి, తీవ్ర నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కోలుకున్న తర్వాత కూడా దగ్గు, వెన్నునొప్పి, నీరసం వంటి లక్షణాలు ఒకటి రెండు నెలలపాటు కొనసాగుతున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
మహారాష్ట్ర వేరియంట్ నుంచి తప్పించుకోవాలంటే కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, రెండు మాస్కులు ధరించాలని నిపుణులు చెప్తున్నారు. లోపల సర్జికల్ మాస్క్, బయట వస్త్రంతో చేసిన మాస్క్ ధరిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. ఎన్ 95 మాస్క్ అయితే ఒక్కటి సరిపోతుందంటున్నారు. ఇంటి తలుపులు, కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంచాలని, ఒకవేళ వైరస్ సోకితే ఇంట్లో తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని, వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

