ఎవరు మీలో కోటీశ్వరుడులో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ పోలీస్ అధికారి
SI Raja Ravindra: ఎవరు మీలో కోటిశ్వరుడు గేమ్ షోలో తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయల నగదు గెలుచుకున్నాడు. దాంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్రలో

హైదరాబాద్: ఎవరు మీలో కోటిశ్వరుడు గేమ్ షోలో తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయల నగదు గెలుచుకున్నాడు. దాంతో తెలుగు టీవీ గేమ్ షోల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంటెస్టెంట్‌గా ఆయన చరిత్ర సృష్టించాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బీ రాజారవీంద్ర ఈ అద్భుతాన్ని చేశాడు. తెలుగు టెలివిజన్ ఛానెల్లో ప్రసారమయ్యే ఓ గేమ్ షోలో ఒక వ్యక్తి ఇంత భారీగా ప్రైజ్ మనీ గెలువడం ఇదే తొలిసారి.
అయితే, జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం అవుతున్నది. ఈ షోలో పాల్గొన్న ఎస్సై రాజారవీంద్ర ఏకంగా కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలిచి.. తెలుగు టీవీ గేమ్ షోలో భారీగా నగదు గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచాడు. సాధారణ పార్టిసిపెంట్స్, సెలెబ్రిటీ పార్టిసిపెంట్స్‌లో ఎవరు కూడా ఇంతవరకు ఇంత భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా గెలుచుకోలేదు.
దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ గేమ్ షోలో ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. అయితే వారంతా వేలు, లక్షల్లో మాత్రమే నగదు బహుమతి గెలుచుకోగలిగారు. కానీ రాజారవీంద్ర ఒక్కడే కోటి రూపాయలు గెలుచుకుని పోయాడు. ఈ విషయాన్ని జెమినీ టీవీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, రాజారవీంద్ర పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తూనే అనేక క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాడు.
పోలీస్ కాంపిటీషన్స్‌లో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించాడు. ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒలింపిక్స్ పతకం గెలువాలన్నది రాజారవీంద్ర కల. ఎవరు మీలో కోట్వీరుడు గేమ్ షోలో గెలిచిన ప్రైజ్ మనీని తన కల నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకుంటానని ఆయన చెప్పాడు. కాగా, రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళ వారాల్లో (రేపు, ఎల్లుండి) రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

