ముఖ్యనేత చుట్టం.. ఆర్టీఏలో చక్రం!
రవాణా శాఖలో ముఖ్యనేత బంధువుదే ఇష్టారాజ్యం నడుస్తున్నది. గత ప్రభుత్వంలో కేవలం కానిస్టేబుల్‌గా పనిచేసే అతడు.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మంత్రికి తీసిపోని విధంగా వ్యవహరిస్తూ.. ఆర్టీఏను శాసిస్తున్నాడు. ఏ ఫైల్ కదలాలన్నా, ఆగాలన్నా అతడి అనుమతి ఉండాల్సిందే. ఆ శాఖ మంత్రిని దాటుకొని మరీ బదిలీలు, పైరవీల్లో జోక్యం, అధికారులపై జులుం ప్రదర్శిస్తూ చెలరేగిపోతున్నాడు.
- రవాణా శాఖలో ఆ కానిస్టేబుల్‌దే పవర్
- ఫైల్ కదలాలన్నా, ఆగాలన్నా అన్నీ అతడే
- మొన్న ముగ్గురు ఎంవీఐల ప్రమోషన్‌కు అడ్డుపుల్ల
- తాజాగా ఎంవీఐ, ఆర్టీవోపై వేటులో తీవ్ర ఒత్తిడి
- తప్పు లేకున్నా సస్పెన్షన్‌పై అధికారుల్లో ఆవేదన
- ఫైళ్ల క్లియరెన్స్, టెండర్ల కేటాయింపులు, బదిలీల్లో జోక్యం
- హద్దులు దాటి శాసిస్తున్నా నోరుమెదపని ఆ శాఖ మంత్రి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రవాణా శాఖలో ముఖ్యనేత బంధువుదే ఇష్టారాజ్యం నడుస్తున్నది. గత ప్రభుత్వంలో కేవలం కానిస్టేబుల్‌గా పనిచేసే అతడు.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మంత్రికి తీసిపోని విధంగా వ్యవహరిస్తూ.. ఆర్టీఏను శాసిస్తున్నాడు. ఏ ఫైల్ కదలాలన్నా, ఆగాలన్నా అతడి అనుమతి ఉండాల్సిందే. ఆ శాఖ మంత్రిని దాటుకొని మరీ బదిలీలు, పైరవీల్లో జోక్యం, అధికారులపై జులుం ప్రదర్శిస్తూ చెలరేగిపోతున్నాడు. నిబంధనల గీత దాటి రెచ్చిపోతున్నా మంత్రి, ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు.
ఇదే అదనుగా అన్నీతానై చక్రం తిప్పుతున్నాడు. రెండు నెలల క్రితం జరిగిన ఎంవీఐ, ఏవో, ఆర్టీవోల ప్రమోషన్లలో సీనియర్లతో జాబితా సిద్ధమైనప్పటికీ ఆ కానిస్టేబుల్ పవర్‌తో సెక్రటేరియెంట్ కేంద్రంగా లిస్ట్ మార్చాల్సి రావడం గమనార్హం. ఇలా బదిలీలు, గిట్టని అధికారులపై వేధింపులు, ఫైళ్లు క్లియరెన్స్, లావాదేవీలన్నింటిలోనూ ఆ కానిస్టేబుల్ శాసిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా సదరు శాఖ మంత్రి మాత్రం మౌనం వహిస్తుండటంపై అధికారులు లోలోన కుమిలిపోతున్నారు.
లిస్ట్ రెడీ చేసి వెంటాడుతూ!
ఇటీవల బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో కొత్తగా విధుల్లో చేరిన ఆర్టీవోను సస్పెండ్ చేయడంలోనూ ఆ కానిస్టేబుల్ సెక్రటేరియట్ రాజకీయాలు మరోమారు వెలుగులోకి వచ్చాయి. అవినీతిపై సిబ్బందిని ప్రశ్నించిన ఆ ఆర్టీవోను అక్కడ్నుంచి ఎలాగైనా పంపించాలని కొందరు చేసిన కుట్రలో భాగంగా అక్కడే విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ నగదు లెక్కించినట్టు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. ఇదే అదనుగా భావించి ఆ ఆర్టీవోపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి వచ్చింది. అయితే అధికారులు ఆ ఆర్టీవో తప్పిదం లేకపోవడంతో తొలుత ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. అది గిట్టని ఆ కానిస్టేబుల్.. సదరు ఆర్టీవో తన మనిషి కాదని ఎలాగైనా సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చాడు.
వారు కూడా చేసేదేమీ లేక ఎంవీఐ భీమ్‌నాయక్, ఆర్టీవో రాంచందర్నాయక్లపై వేటు వేశారు. కింది స్థాయి సిబ్బంది నగదు లెక్కించి పట్టుబడినా ఆర్టీవోలను బాధ్యులుగా చేయడం ఏందంటూ భయభయంగా పనిచేస్తున్నారు. అంతేగాక సదరు గతంలో అతడు పనిచేసిన ఆఫీసుట్లో జరిగిన గొడవలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడనే చర్చ జరుగుతున్నది. ఏడాదిలో రిటైర్ కాబోయే ఓ ఆర్టీవోను కూడా వేధిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు ఆర్టీవోలను సుదూర జిల్లాలకు బదిలీ చేయించి మానసిక వేదనకు గురిచేశాడు. అధికారులపైనే కాదు పలు ఫైళ్లు, టెండర్లు ఎవరికి ఇవ్వాలో ముందే ఖరారు చేస్తున్నాడని ఆరోపణలున్నాయి.
ఆర్టీఏలో కోల్డ్ వార్!
ఆర్టీఏలో సదరు కానిస్టేబుల్ జోక్యం మితిమీరుతున్నదని కొందరు ఆర్టీవోలు తమ ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు కూడా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫైళ్ల క్లియరెన్స్‌లో ఒత్తిడి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. వినని వారిపై ఏసీబీ దాడులు జరిగేలా ప్లాన్ చేస్తూ బెదిరిస్తున్నాడని తెలిసింది. ఈ వ్యవహారంపై సదరు మంత్రికి నివేదించినా పరిస్థితి మారడం లేదని సన్నిహితులతో గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఒక కానిస్టేబుల్ హోదాకు ఆర్టీవో, జేటీసీ, కమిషనర్ స్థాయి అధికారులు వెనక్కి తగ్గాల్సి రావడంతో ఆర్టీఏలో అంతా అవాక్కవుతున్నారు. రాజకీయ పలుకుబడి ముందు అధికార బాధ్యత దేనికీ నిలబడలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

