Ayodhya Live | అయోధ్య లైవ్.. ఈ లింకులు ఓపెన్ చేశారో వారి చేతికి చిక్కినట్టే!
‘అయోధ్య లైవ్' పేరిట వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, విశేషాలంటూ..
Ayodhya Live | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ‘అయోధ్య లైవ్’ పేరిట వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్‌లు పంపుతూ సైబర్ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉన్నదని, ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్‌లను, మెయిల్స్ ను ఓపెన్ చేయొద్దంటూ సూచించారు.
తప్పుడు సమాచారంపై జాగ్రత్త!
న్యూఢిల్లీ: రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం మీడియా, సోషల్ మీడియా సంస్థలకు శనివారం పలు సూచనలు జారీ చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వార్తల ప్రసారం, సమాచారం ప్రచురణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు విషయాలను అడ్డుకోవాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, నకిలీ సందేశాలు విస్తృతంగా వ్యాప్తి చెందడాన్ని గుర్తించామని, ఇవి మత సామరస్యాన్ని, శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని కేంద్ర ఐటీ, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

