Rajagopal Reddy | తుమ్మలకు మంత్రి పదవా.. సిగ్గు, శరం ఉండాలె : రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Video
Rajagopal Reddy | తుమ్మల నాగేశ్వర్రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు కానీ తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా..? అని ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఇలా నోరు జారారు.
Rajagopal Reddy : తుమ్మల నాగేశ్వర్రావుకు మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు కానీ తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా..? అని ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఇలా నోరు జారారు.
గత ప్రభుత్వం తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చిన విషయంపైనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన విషయాన్ని గుర్తించలేకపోయారు. అసలు తుమ్మల నాగేశ్వర్రావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి మర్చిపోయినట్టుకున్నారు. అందుకే తుమ్మల బీఆర్ఎస్ నేతనే అన్న భ్రమలో ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా
తుమ్మల నాగేశ్వరరావుపై ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తుమ్మల ఉద్యమకారుడు కాదు అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఎలా ఇచ్చారు? – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి pic.twitter.com/axcfAH9lwE
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2024
కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరును తెలంగాణ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్రావు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నాడన్న సోయి కూడా రాజగోపాల్‌రెడ్డికి లేనట్టుందని నవ్వుకుంటున్నారు. గతంలో తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గు, శరం లేని పని అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభత్వంలో కూడా మంత్రి పదవి ఎందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా తన సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. తాను ఇప్పుడు సొంత పార్టీ నేతనే అన్న సోయి కూడా రాజగోపాల్ రెడ్డికి లేకపోతే ఎలా..? అని అసంతృప్తి వెళ్లగక్కినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంలోని ఇతర అగ్ర నేతలు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.
కాగా, తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుపడుతూ రాజగోపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు తుమ్మల మన పార్టీలో ఉన్నాడని గుర్తుచేశాడు. దాంతో నోరు జారినట్టు గ్రహించిన కోమటిరెడ్డి.. పొరపాటుగా అన్నానని చెప్పకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘అప్పుడు అక్కడనే ఉండె కదా..’ అంటూ కవర్ చేయబోయారు. కానీ అప్పటికే తుమ్మల మనసును మాత్రం నొప్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

