‘స్థానిక’ రిజర్వేషన్లపై సీఎస్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు
ఎంతో గోప్యంగా నిర్వహించాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ బయటకు పొక్కినట్టు తెలుస్తున్నది. దీంతో ఏయే స్థానాలు ఏ వర్గాలకు రిజర్వు అయ్యాయో ముందే తెలుసుకున్న అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల ప్రక్రియ తామనుకున్న రీతిలో జరగలేదని అధికారులపై మండిపడుతున్నారు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవకతవకలు జరిగాయని ఆరోపణ
- 2 జిల్లాల్లో రిజర్వేషన్ ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని విజ్ఞప్తి
- బడుగు, బలహీనవర్గాల వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన
జగిత్యాల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎంతో గోప్యంగా నిర్వహించాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ బయటకు పొక్కినట్టు తెలుస్తున్నది. దీంతో ఏయే స్థానాలు ఏ వర్గాలకు రిజర్వు అయ్యాయో ముందే తెలుసుకున్న అధికార పార్టీ నేతలు రిజర్వేషన్ల ప్రక్రియ తామనుకున్న రీతిలో జరగలేదని అధికారులపై మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని తమ నాయకులకు తెలుపడంతో ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి లేఖ రాస్తూ రిజర్వేషన్లను తిరిగి కేటాయించాలని కోరినట్టు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఈ మేరకు ఓ మెయిల్ పంపినట్టు సమాచారం. కరీంనగర్‌తో పాటు, జగిత్యాల జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదన్న ఎమ్మెల్యే దీనివల్ల బడుగు, బలహీనవర్గాల వారికి అన్యా యం జరుగుతుందని పేర్కొన్నట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని క్యాటగిరీల రిజర్వేషన్లు నిర్వహించి సీల్డ్ కవర్లో అందించాలని, అలాగే రిజర్వేషన్ల వివరాలను గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మే రకు అన్ని జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు సంబంధించిన రిజర్వేషన్ల కోటాను జనాభా ఆధారంగా రూపొందించారు. ఒకవైపు అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్న సమయంలోనే మండల స్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తమ మండలంలో జడ్పీటీసీ, ఎంపీ పీ, ఎంపీటీసీల స్థానాలు, సర్పంచ్ స్థానా లు ఏ క్యాటగిరీకి రిజర్వు అవుతున్నాయన్న వివరాలను తెలుసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

