రామాయంపేటలో కాంగ్రెస్ రౌడీయిజం
ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా ఓటర్లకు డబ్బుల పంపకాలు జరుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకున్నది.
- ఇండిపెండెంట్ అభ్యర్థులను చితకబాదిన కాంగ్రెస్ నాయకులు
- తమ్ముడిపై దాడిని తట్టుకోలేక అభ్యర్థి అన్న ఆత్మహత్యాయత్నం
రామాయంపేట, ఫిబ్రవరి 9 : ఓ యూట్యూబర్ ఇంట్లో రహస్యంగా ఓటర్లకు డబ్బుల పంపకాలు జరుపుతున్న కాంగ్రెస్ నాయకులను ఇండిపెండెంట్ అభ్యర్థులు అడ్డుకున్న ఘటన ఆదివారం అర్ధరాత్రి మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకున్నది. రామాయపేట మున్సిపాలిటీలోని 11వ వార్డులో కాంగ్రెస్ నాయకులు ఓ యూట్యూబర్ అండ చూసుకుని డబ్బుల పంపకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న అదే వార్డుకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి భర్త లింగం, 9వ వార్డు అభ్యర్థి చిలుక గంగాధర్ అక్కడికి చేరుకుని డబ్బుల పంపకాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న సదరు వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వారిద్దరిని తన మందితో కలిసి చితకబాదాడు.
పోలీసులు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనపై ఇరువురు వేర్వేరుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ.. తమపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడిచేసి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థి చిలుక గంగాధర్పై కాంగ్రెస్ నాయకులదాడిని తట్టుకోలేక అతడి సోదరుడు చిలుక రాజయ్య సోమవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సోదరులు వెంటనే గంగాధర్ను రామాయంపేటలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

