గిరిజన రైతులపై కాంగ్రెస్ నేతల దాడులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుం చి ఆ పార్టీ నాయకులు తరచూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు.
మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుం చి ఆ పార్టీ నాయకులు తరచూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. సో మవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం షాబాద్ తండాలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి.. మెదక్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న గిరిజన రైతుల ను మంగళవారం ఆయన పరామర్శించా రు. బాధితులతో కలిసి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు.
అనంతరం క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం షాబాద్ తండాలోని సర్వేనంబర్ 86లో 360 ఎకరాల భూమి ఉందని, అందులో 150 ఎకరాల్లో పట్టాలివ్వగా, మిగతా భూమిని గిరిజనులు సాగుచేసుకుంటున్న రైతులపై సోమవారం కాం గ్రెస్ నేతలు దాడి చేసి గాయపర్చారని విమర్శించారు. మెదక్ ప్రభుత్వ దవాఖానలో బుజ్జి, యమున, ప్రమీల చికిత్స పొందుతున్నారని తెలిపారు. మంత్రి దామోదర రాజనర్సింహ అండతో కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

