గాంధీభవన్‌కు చేరిన కాంగ్రెస్ అంతర్గత విభేదాలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి గాంధీభవన్‌కు చేరాయి. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి అనుకూలంగా కామారెడ్డి నేతలు గాంధీభవన్ వద్ద పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడ హంగామా నెలకొన్నది.
- పార్టీ ఆఫీస్‌లో షబ్బీర్ అలీ మద్దతు దారుల హంగామా
- ఆయనకు మద్దతుగా భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్ల ప్రదర్శన
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి గాంధీభవన్‌కు చేరాయి. పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీకి అనుకూలంగా కామారెడ్డి నేతలు గాంధీభవన్ వద్ద పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడ హంగామా నెలకొన్నది. షబ్బీర్ అలీకి మద్దతుగా వెలసిన ఈ ఫ్లెక్సీలు, పోస్టర్లు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫ్లెక్సీల్లో ‘నిజం ఎప్పటికీ మరుగున పడదు’, ‘నిజమైన నాయకుడిని ఎవరూ తక్కువ చేయలేరు’, ‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన చాంపియన్ షబ్బీర్ అలీ’ అంటూ ముద్రించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ వర్గానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన చంద్రశేఖర్‌రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యల వీడియోలు బయటకు రావడం, ఆ తర్వాత ఆయనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీలు వెలువడం కలకలం రేపింది. కామారెడ్డి నియోజకవర్గ నేతలు గాంధీభవన్ వేదికగా బలనిరూపణకు దిగడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

