స్టేషన్ ఘనపూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోనీ చాగల్లులో దారుణం చోటుచేసుకుంది. చాగల్లులోని 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్ సోమవారం రాత్రి ఓ వృద్ధురాలి పై లైంగిక దాడిరి యత్నించగా వృద్ధురాలు అరవడంతో స్థానికులు 100కు కాల్ చేశారు చేశారు.
కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కౌన్సిలర్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి 329(4), 74 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీని పై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ సంఘటన జిల్లాలో చర్చనియాంశాంగా మారింది.