వైద్య బదిలీలు ఆగమాగం
వైద్యశాఖలో బదిలీలు గందరగోళంగా తయారవుతున్నాయి. తమ గోడును అధికారులు వినకపోవడంతో ఉద్యోగులు గురువారం కోఠిలోని డీపీహెచ్ కార్యాలయాన్ని ముట్టడించారు.
- డీపీహెచ్ కార్యాలయం ముందు నర్సుల ఆందోళన
- సీనియార్టీ జాబితాలో తప్పులంటూ విమర్శలు
- అప్లోడ్ చేసిన వివరాలు తప్పుగా వచ్చాయన్న బాధితులు
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో బదిలీలు గందరగోళంగా తయారవుతున్నాయి. తమ గోడును అధికారులు వినకపోవడంతో ఉద్యోగులు గురువారం కోఠిలోని డీపీహెచ్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీనియార్టీ జాబితాను అస్తవ్యస్తంగా రూపొందించారని, మార్చాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో డీపీహెచ్ రవీంద్రనాయక్ అందుబాటులో లేకపోవడంతో గంటలపాటు అక్కడే నిరసన తెలిపారు. తాము అప్లోడ్ చేసిన వివరాలు మారిపోయాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పులు సరిచేయడానికి ఎడిట్ ఆప్షన్ కూడా లేదన్నారు. సీనియార్టీ తప్పుగా నమోదైందంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యారోగ్య శాఖలో బదిలీల్లో గందరగోళంపై టీటీజీడీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైద్యసేవలపై నిఘాకు కమిటీలు: మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నాణ్యత, పారదర్శకత పెంచటానికి వేర్వేరుగా కమిటీలను నియమిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రైవేట్ దవాఖానల ఆగడాలపై నిఘా కొనసాగుతుందన్నారు. గురువారం ఆయన సచివాలయంలో కార్పొరేట్ దవాఖానల యజమన్యాలతో మాట్లాడుతూ.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ దవాఖానలకు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఆరోగ్యశ్రీ బకాయిలు త్వరగా విడుదల చేయాలని దవాఖానల యజమానులు, ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

