Karimnagar | అధికారులే అమ్మానాన్నలు.. ప్రజాప్రతినిధులే ప్రత్యేక అతిథులు
అనాథ యువతికి అధికారులు, ప్రజాప్రతినిధులే అమ్మానాన్నలయ్యారు. చిరుప్రాయంలోనే బాలసదనానికి చేరి సిబ్బంది సంరక్షణలో పెరిగి, పెళ్లీడుకొచ్చిన యువతికి మేమున్నామంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెండ్లి పెద్దలై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభవన్ వేదికగా అంగరంగవైభవంగా వివాహాన్ని జరిపించారు.
- కళాభారతి వేదికగా అనాథ యువతి కల్యాణం
- అన్నీ తామై వివాహం జరిపించిన స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారులు
Karimnagar | కలెక్టరేట్, మార్చి 9: అనాథ యువతికి అధికారులు, ప్రజాప్రతినిధులే అమ్మానాన్నలయ్యారు. చిరుప్రాయంలోనే బాలసదనానికి చేరి సిబ్బంది సంరక్షణలో పెరిగి, పెళ్లీడుకొచ్చిన యువతికి మేమున్నామంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెండ్లి పెద్దలై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభవన్ వేదికగా అంగరంగవైభవంగా వివాహాన్ని జరిపించారు. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు లేని మౌనిక 2017లో బాలసదనంలో చేరింది.
ఆమెకు అధికారులే చదువు చెప్పించి, ఆలనాపాలనా చూశారు. ఇంటర్మీడియట్ అనంతరం ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్న్‌షిప్ చేస్తుండగా, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో వారు ఆ యువకుడు, కుటుంబసభ్యులతో మాట్లాడి పెళ్లి నిశ్చయించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు. కలెక్టర్, జిల్లా జడ్జి, అధికారులు, టీఎన్జీవో నాయకులు తమవంతు సహాయ సహకారాలు అందజేయడంతో మౌనిక వివాహం అత్యంత ఘనంగా జరిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

