Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి అధికారిక షెడ్యూల్ ఖరారు కాలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను కూడా నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి కనగల్ పర్యటన వాయిదా పడిందని, త్వరలోనే మరో తేదీ ఖరారు చేస్తారని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపినట్లు సమాచారం. వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేని కారణంగానే వాయిదా వేశారని ఆయన చెప్పారు. వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభ స్థలం చిత్తడిగతా మారిందని.. పెద్ద టెంట్లు నిలబడటం లేదని వివరిచినట్లు తెలుస్తోంది.