హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ 79వసారి రాజకీయ పర్యటనకు ఢిల్లీ వెళ్లారు. ఓట్ బచావో.. దేశ్ బచావో ఆందోళనలో భాగంగా అరెస్ట్ అయిన తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంఘీభావం తెలిపేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా కాన్క్లేవ్లో ప్రధా ని మోదీకి అనుకూలంగా చేసిన వ్యా ఖ్య టలపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ పెద్దల మెప్పుకోసమే రేవంత్ హస్తినకు వెళ్లి రాహుల్‌కు సంఘీభావం తెలిపారని పలువురు భావిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల సీఎంలు కరువు సన్నద్ధ చర్య ల్లో మునిగితేలుతుంటే మన ముఖ్యమంత్రి మాత్రం పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ఆరాటపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సీఎం డీకే శివకుమార్ రాహుల్ చేపట్టిన నిరసనకు దూరంగా ఉన్నవేళ.. రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం చూపడంలోని ఆంతర్యమేందని ప్రశ్నిస్తున్నారు.