CM Revanth Reddy | మూసీ బడ్జెట్‌పై రేవంత్ యూటర్న్!
మూసీ సుందరీకరణ బడ్జెట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని సీఎం ప్రకటించారు.
- తొలుత 1.5 లక్షల కోట్లతో సుందరీకరణ చేపడతామన్న సీఎం
- అంత భారీ బడ్జెట్ ఎందుకంటూ కేటీఆర్ ప్రశ్న
- అది కేవలం మూసీకే కాదు.. ఆర్ఆర్ఆర్, మెట్రో అన్నీ కలిపి టూ సీఎం వివరణ
- బడ్జెట్లో అన్యాయం జరిగినా మోదీని కలుస్తా
- రేషన్‌కార్డు లేని వాళ్లకు కూడా రుణమాఫీ
- మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ బడ్జెట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని సీఎం ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టునే రూ.80 వేల కోట్లతో నిర్మిస్తే.. మూసీ సుందరీకరణకు అంత భారీ బడ్జెట్ ఎందుకని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో సోమవారం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన రేవంత్‌రెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. రూ.1.5 లక్షల కోట్లు కేవలం మూసీ సుందరీకరణకు మాత్రమే కాదని, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు, సర్వీస్ రోడ్లకు రూ.15 వేల కోట్లు, మెట్రో విస్తరణ, ఐదేండ్లపాటు నిర్వహణ ఇలా అన్నింటికీ కలిపి రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్, మెట్రోకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు ఆ బడ్జెట్‌ను మూసీ సుందరీకరణ బడ్జెట్లో కలపడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మోదీని కలుస్తూనే ఉంటా
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యా యం జరిగినప్పటికీ ఇకపై ప్రధాని మోదీ ని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. వారిని కలవడంలో ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు. ఇచ్చింది తీసుకుంటామని, ఇవ్వని దాని కోసం కోట్లాడుతామని తెలిపారు. లిక్కర్ వినియోగం పెరిగిందంటే పేదరికం కూడా పెరిగినట్టేనని వ్యాఖ్యానించారు.
రేషన్‌కార్డు లేని వాళ్లకు కూడా రుణమాఫీ చేస్తామని, ఒకవేళ సాంకేతిక కారణాలతో కాకపోతే ఫిర్యాదుచేయాలని సూచించారు. హైదరాబాద్‌లో గ్రౌండ్‌వాటర్ పెంచేందుకు పలు ఖాళీ స్థలాల్లో అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌లను నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

