హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్
ప్రపంచదేశాలతో పోటీపడే విధంగా హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
- వెయ్యి ఎకరాల్లో ఏర్పాటుకు ప్రణాళిక
- అన్ని వైద్యసేవలనూ ఒకే గొడుగు కింద అందిందించేందుకు కృషి
- రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడతా
- బసవతారకం క్యాన్సర్ దవాఖాన వ్యవస్థాపక వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్, జూన్ 22: ప్రపంచదేశాలతో పోటీపడే విధంగా హైదరాబాద్‌లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దేశప్రజలతో పాటు విదేశాల నుంచి వచ్చే వారికి సైతం అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు ఒకే గొడుగు కింద అందేలా వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వ్యవస్థాపక వేడుకలు శనివారం జరిగాయి. ఈ వేడుకను హాస్పిటల్ చైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ బాధతో మరొకరు మరణించవద్దన్న దృఢ సంకల్పంతో 24 ఏండ్లక్రితం ఎన్టీఆర్ నాటిన ఈ చిన్నమొక్క మహావృక్షంగా మారి లక్షలమంది క్యాన్సర్ రోగులకు నీడనివ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
ఎన్టీఆర్ కుటుంబంలో మూడోతరం కూడా ఈ గొప్ప సంకల్పాన్ని ముందుకుతీసుకెళ్లాలని.. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడతానని రేవంత్ అన్నారు. చంద్రబాబు రోజూ 18 గంటలు పనిచేస్తుంటే.. తాను 12 గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. తెలంగాణరాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందేనని అ న్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ర్టాలు పోటీపడాలని, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ట్రస్ట్ బోర్డు సభ్యు లు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, విశాఖ ఎంపీ యం భరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మెన్ బాలకృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకుని కేక కట్‌చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

