CM KCR | ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి వెట్ రన్.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR | ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు - రంగారెడ్డి సిద్ధమైంది. ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించిన తెలిసిందే. ఈ క్రమంలో వెట్ రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
CM KCR | ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు – రంగారెడ్డి సిద్ధమైంది. ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించిన తెలిసిందే. ఈ క్రమంలో వెట్ రన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ఛాన్ చేసి ప్రారంభించనున్నారు. వెట్రన్లో భాగంగా రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణానదికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వెట్‌రన్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా.. సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెపల్లె నుంచి హాజరుకానున్న ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయనున్నారు.
దక్షిణ తెలంగాణకు పండుగ రోజు : సీఎం కేసీఆర్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించుకుందామంటూ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణకు పండుగ రోజులాంటిదని, సీఎం కేసీఆర్ ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజినీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని, పట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

