Kollur | ఆసియాలోనే అతిపెద్ద గృహసముదాయం.. కొల్లూరులో 145 ఎకరాల్లో 1489.29 కోట్లతో కేసీఆర్ నగర్
గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం ఉద యం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
- నేడు కొల్లూరు డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభం
- 15,660 ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ
Kollur | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని గురువారం ఉద యం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆనంతరం ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించనున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వపరంగా లబ్ధిదారులకు ఒక్క నయాపైసా ఖర్చు లేకుండా ఉచితంగా పంపిణీ చేసే అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్టుగా కొల్లూరు నిలువనున్నది.
సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో నిర్మాణాలు చేపట్టారు.
ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్
సంగారెడ్డి జిల్లా కొల్లూరు వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదా యం ఆసియాలోనే అతిపెద్దదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయడం గర్వంగా ఉందని గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘ధైర్యంగా కల కనండి.. వాటిని సాకారం చేసేందుకు సం సిద్ధులు కండి’ అనేదే కేసీఆర్ గారి మంత్ర అని.. ఆ నినాదంతోనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ సముదాయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

