నవ భారత నిర్మాణానికి మీరంతా అడుగులేయాలి : సీఎం కేసీఆర్
CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మెడికల్ విద్యా
వరంగల్ : మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మెడికల్ విద్యా రంగంలో కృషి చేస్తూనే నవ సమాజ నిర్మాణానికి, నవ భారత నిర్మాణానికి మీరంతా అడుగులు ముందుకు వేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీని ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారవుతుందన్నారు. ప్రయోగత్మకంగా.. సిరిసిల్ల, ములుగు నియోజకవర్గాల్లో 100 శాతం హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఒక వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా.. ఏ రకమైన యాక్సిడెంట్ జరిగినా.. ఒక్క నిమిషంలో డేటా బయటపడుతుంది. 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం పూర్తయితే నిమిషంలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర తెలుస్తుంది. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్య సంభవించినా నిమిషాల్లో వారి డేటా బయటపడుతుందన్నారు. క్షణాల్లో వైద్యం అందుతుందన్నారు. అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లం అవుతాం. హెల్త్ యూనివర్సిటీని కూడా వరంగల్‌లోనే నెలకొల్పామని చెప్పారు. వరంగల్ లో నెలకొల్పుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి 2000 పడకలతో ఏర్పాటు అవుతోంది. 24 అంతస్తుల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ మెడికల్ సిటీ హైదరాబాద్‌ను మించి పోతుందన్నారు. బ్రహ్మాండమైన ఆ సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వారే వరంగల్‌కు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

