యాదాద్రి నుంచి ఖమ్మం బయలుదేరిన ముఖ్యమంత్రులు
CM KCR | యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు ఖమ్మం బయలుదేరారు. మరికాసేపట్లో ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రివాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డీ.రాజా ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకున్నారు. అనంతరం పినరయి విజయన్, రాజా మినహా మిగిలిన నేతలు యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్నారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఆ తర్వాత నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు కలిసి ఖమ్మం బయలుదేరారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. తర్వాత సీఎం కేసీఆర్‌తోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆరుగురికి కళ్ల అద్దాలు అందిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

