దేశంలో విద్వేషాలు రగలొద్దు : సీఎం కేసీఆర్
CM KCR | అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్‌లో ప్రతిక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన
వరంగల్ : అందర్నీ కలుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు రగలొద్దు.. విద్వేష రాజకీయాలను గ్రహించి యువత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఈ దేశం చాలా గొప్ప దేశం. సహనశీలత దేశం. అవసరమైన సందర్భాల్లో త్యాగాలకు సిద్ధపడే దేశం. పోరాటాలతో ముందుకు పోయే దేశం. అందర్నీ కలుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం. పూలబోకే లాంటి గొప్ప దేశం. ప్రేమతో బతికేటటువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు.. ఏ రకంగా కూడా సమాజానికి మంచిది కాదు. నా వయసు అయిపోతుంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భవిష్యత్ మీది.. ఈ భారతదేశం మీది. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం మీ మీద ఉంటది. మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్యను కూడా పెంపొందించుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

