సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళి
సీఎం కేసీఆర్| తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి.. పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల కూడా

హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి.. పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల కూడా ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి, గొప్పదని సీఎం స్మరించుకున్నారు.
‘స్వాతంత్రం వచ్చినతర్వాత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాది రావి’ అని సీఎం తెలిపారు. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారన్నారు. ప్రజా పోరాటాలు విజయవంతం కావాలంటే నిర్దిష్ట పరిస్థితులకు, నిర్దిష్ట కార్యాచరణను అనుసరించాలనే సూత్రాన్ని రావి నారాయణ రెడ్డి ఆచరించి చూపారన్నారు. ఆయన అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అనుసరించిన పార్లమెంటరీ పోరాట పంథాలో ఇమిడివున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

