హోంమంత్రి ఇంట రంజాన్ వేడుకల్లో కేసీఆర్
ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్' సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
- ముస్లింలకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు
- ముఖ్యమంత్రికి హోంమంత్రి కృతజ్ఞతలు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్’ సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి ఆహ్వా నం మేరకు శనివారం మహమూద్ అలీ ఇం ట్లో నిర్వహించిన ఈద్-ఉల్-ఫితర్ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి, ఆయన కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. హోంమం త్రి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవప్రార్థనలు, అవి పెంపొందించే క్షమాగుణం, కరుణ, ప్రేమ తదితర ఆధ్యాత్మిక భావనల గురించి సీఎం స్మరించుకున్నారు.
తనవెంట వచ్చిన మంత్రు లు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పలువురు మత పెద్దలు, సామాన్యులను పేరుపేరునా పలకరించి, అలయ్ బలయ్ తీసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచి తనతో కొనసాగుతున్న బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సత్తార్ గుల్షానీని సీఎం ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్, సలీం, రవీందర్‌సింగ్, మేడె రాజీవ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి జ్ఞాపికను బహూకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

