టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
CM KCR | పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. గౌరెడ్డిపేటలో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు హెలికాప్టర్ ద్వారా పెద్దపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన పూజ కార్యాక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లాశాఖ అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ను జిల్లా అధ్యక్షుడు సీట్లో కూర్చుండబెట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ను నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పెద్దకల్వలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

