హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పద్మారావు కుటుంబసభ్యులతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.