విశ్వ సినీ యవనికపై తెలుగోడి సత్తా
‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు రావడం దేశానికి, తెలంగాణకు గర్వకారణం. విశ్వ సినీ యవనికపై తెలుగోడి సత్తా చాటారు.
- ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ మన దేశానికి గర్వకారణం
- జయశంకర్ భూపాలపల్లి బిడ్డ చంద్రబోస్‌కు శుభాకాంక్షలు
- తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా పాట పదాలు
- హాలీవుడ్‌కు తీసిపోని సినిమాలు మనవి
- రాష్ట్రం నుంచి మరిన్ని సినిమాలు రావాలి
- ఆర్ఆర్ఆర్ బృందానికి సీఎం కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు రావడం దేశానికి, తెలంగాణకు గర్వకారణం. విశ్వ సినీ యవనికపై తెలుగోడి సత్తా చాటారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ను గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచ సినీ సంగీత ప్రియులను ఓలలాడించి, కాలు కదిపేలా చేసిన పాటకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఆసార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతి, తెలుగు ప్రజల రుచి, అభిరుచి, ప్రజాజీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని తెలిపారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్, నేటి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామబిడ్డ చంద్రబోస్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు
ఆర్ఆర్ఆర్ సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్, సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణ విలువల పరంగా, సాంకేతికంగా హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని అన్నారు. ఆసార్ అవార్డుతో తెలంగాణ కేం ద్రంగా, హైదరాబాద్ గడ్డ మీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని వెల్లడించారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారతదేశానికి గర్వకారణం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
తెలుగు సినీ ప్రేక్షకులకు పండుగ రోజు
ప్రపంచ చలనచిత్ర వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ జెండా ఎగురవేసిన రోజు.. తెలుగు సినీ ప్రేక్షకులకు, ప్రేమికులకు పండుగ రోజు అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు సగర్వంగా చెప్పుకునే సుదినమని వెల్లడించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదని వివరించారు. కరోనా కాలంలో తెలుగు సినిమా పరిశ్రమను కష్టాలు చుట్టిముడితే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిధ్యంతో కూడిన కథలతో ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని నిర్మించాలని ఆకాంక్షించారు.
దక్షిణాది అంటే కేంద్రానికి చిన్నచూపు: తలసాని
దక్షిణాది రాష్ర్టాలు అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మొదటి నుంచీ చిన్నచూపేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఆసార్ అవార్డుల కోసం ఎంట్రీలు పంపాలంటే గుజరాతీ సినిమానే ఎంట్రీకి పంపిందని తెలిపారు. కానీ వారికి గుణపాఠం చెప్పేలా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకొన్నదని వెల్లడించారు. సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. దర్శకుడు రాజమౌళి కృషితోనే ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు ఆసార్ దకిందని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు చేపట్టిన చర్యలతో సినిమా రంగానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

