CM KCR | సీనియర్ జర్నలిస్ట్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ కృష్ణారావు (Krishna rao) మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ ఎంవీ కృష్ణారావు (MV Krishna rao) మరణం పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) సంతాపం తెలిపారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజాప్రయోజనాల కోణంలో కృష్ణారావు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1975లో కృష్ణారావు స్టింగర్గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా 18 ఏండ్లపాటు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనను అంతా బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

