దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుంది : సీఎం కేసీఆర్
CM KCR | అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్‌లో
వరంగల్ : అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఏ దేశమైనా, సమాజమైనా చుట్టు సంభవించే పరిణామాలు చూస్తూ అప్డేట్గా ఉండే ముందుకు పురోగమిస్తుంది. ఏమరపాటుతో ఉంటే చాలా దెబ్బ తింటాం. మన రాష్ట్రంలో మనం పడ్డ బాధనే గుర్తు చేసుకుందాం. నాటి నాయకత్వం తప్పిదం వల్ల రాష్ట్రాన్ని సాధించుకునేందుకు దశాబ్దాల కాలం పట్టింది. ఏడేండ్ల కింద తెలంగాణకు, ఇప్పుడున్న తెలంగాణకు చాలా తేడా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణను బాగు చేసుకున్నాం. దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి ఎదిగాం. భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ లాంటిది. అమెరికాలో వ్యవసాయ అనుకూల భూమి లేదు. చైనాలో కూడా 16 శాతం మాత్రమే వ్యవసాయం భూమి ఉంది. కానీ మన దేశంలో 50 శాతం భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్ని రకాల నేలలు కూడా ఉన్నాయి. 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇన్ని వనరులు, వసతులు ఉన్న ఈ దేశం వంచించబడుతుంది. అవకాశాలు కోల్పోతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మనకు మన పెద్దల నుంచి విజ్ఞానం లభించింది కాబట్టి ఈ విధంగా ఉన్నాం. రాబోయే తరాలకు మంచిని, సంస్కారాన్ని, అభ్యుదయ భావజాలాన్ని అందించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- agriculture
- CM KCR
- farmers
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

