CI’s Transfers | హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా సీఐలకు స్థానచలనం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 63 మంది సీఐ మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ శ్రీనివాస్‌రెడ్డి సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 41 మంది సీఐలను అవినాశ్ మహంతి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల నగర పరిధిలో పోలీసులు ప్రభుత్వం బదిలీలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కింద రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ తరుణ్ జోషి బదిలీ చేశారు.