Water Battery | బీజింగ్: చైనాకు చెందిన పరిశోధకులు సరికొత్త వాటర్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. సంప్రదాయ లిథియం బ్యాటరీలతో పోలిస్తే, ఇవి రెట్టింపు స్థాయిలో శక్తిని నిల్వ చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ బ్యాటరీలను వినియోగించేందుకు ఈ సాంకేతికత కీలకం కానున్నదని పేర్కొన్నారు. ఇతర బ్యాటరీలతో పోలిస్తే ఈ వాటర్ బ్యాటరీలు ఎంతో సురక్షితమైనవని వెల్లడించారు.