హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో క్యాసినో నిర్వహణలో హవాలా లావాదేవీలపై ఈడీ ఆరా కొనసాగుతున్నది. వరుసగా బుధవారం మూడోరోజు సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డితోపాటు హవాలా ఏజెంట్ సంపత్‌ను ప్రశ్నించారు.
హవాలా మార్గంలో లావాదేవీలకు సంబంధించే గంటల తరబడి ఈ ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇదే కేసులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈడీ అధికారులు నగరంలోని మరో ముగ్గురు హవాలా ఏజెంట్ల ఇండ్లు కార్యాలయాల్లోనూ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. వారిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.