చాంద్రాయణగుట్ట, జూలై 16: క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లాల్‌దర్వాజలో బో నాల పండుగ సందర్భంగా ఆయన తన అనుచరులతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ప్రవీణ్ సెక్యూరిటీగా వచ్చిన ముగ్గురి వద్ద సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రివాల్వర్లను గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రివాల్వర్లను స్వాధీనం చేసుకొ ని, వారిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. భారీ జనం ఉన్న చోటకు ప్రైవేట్ సెక్యూరిటీతో ఆయుధాలు కలిగి రావడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోశ్ తెలిపారు.