ప్రజలు సుఖశాంతులతో జీవించాలి.. అమ్మవారిని ప్రార్థించిన సీఎం కేసీఆర్
సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పకన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆటపాటలతో, పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు.
- రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పకన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆటపాటలతో, పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒకరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని ఆయన ప్రార్థించారు.
సంస్కృతి, ఆధునికతల సమ్మిళితంబతుకమ్మ: మంత్రి కేటీఆర్
బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి, ఆధునికత అద్భుతంగా మిళితమై ఉన్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఎలక్ట్రిక్ ఫార్ములా వన్ కారు, బతుకమ్మతో ఉన్న ఫొటోను మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా, దానిని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

