హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫైనల్, సీఏ ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. సీఏ ఫైనల్ గ్రూప్ -1లో 9.46శాతం, గ్రూప్ -2లో 21.6శాతం, రెండింటిలో 9.42శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇక సీఏ ఇంటర్మీడియట్ తీసుకొంటే గ్రూప్ -1లో 16.78శాతం, గ్రూప్ -2లో 19.18శాతం, రెండింటిలో 9.73 శాతం చొప్పున విద్యార్థులు పాసయ్యారు.