హైదరాబాద్ : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానల్లో ‘పోల్’ పేరిట మంత్రి కేటీఆర్ తనయుడిపై బాడీ షేమింగ్‌కు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని, ఈ చర్యను ఖండిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. యూట్యూబ్ చానల్ పేరిట వాడుతున్న భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైందని, దీన్ని ఎవరూ అంగీకరించరన్నారు.
జర్నలిస్టుల పేరిట, పత్రికా స్వేచ్ఛ పేరిట వాడుతున్న భాషను రాజకీయ విధానాలపై కాకుండా కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగుతున్న ప్రయత్నాలను మీడియా అకాడమీ చైర్మన్‌గా ఖండిస్తున్నానన్నారు. ఇది జర్నలిజం కాదని, ఈ భాష జర్నలిస్టులు వాడదగినది కాదన్నారు. పత్రికా స్వేచ్ఛ పేరిట ఇదొక అన్యాయమైన అప్రజాస్వామిక చర్య అని, దుర్మార్గమైందన్నారు.
యూట్యూబ్ చానళ్ల పేరిట సోషల్ మీడియాలో చలామణి అవుతున్న చాలామంది ప్రాథమికంగా జర్నలిస్టులు కాదన్నారు. ఇది ప్రత్యేకంగా ఒక విద్వేష పూరితమైన ప్రాయోజిత ప్రచారంలో భాగంగానే జరుగుతుందని మీడియా అకాడమీ చైర్మన్‌గా భావిస్తున్నానన్నారు.