మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు : సీఈవో
Munugode By Polls | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడినట్లు సీఈవో తెలిపారు. ఫిర్యాదు వచ్చిన సామాజిక మాధ్యమాల లింకుల ద్వారా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు చెప్పారు. పోలీసులు వెంటనే కలగజేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారన్నారు. అదేవిధంగా మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తినట్లు సీఈవో తెలిపారు. మరోచోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడంతో రీప్లేస్ చేసినట్లు చెప్పారు. ఈవీఎం సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు వివరించారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

