ఒకే రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా?.. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేయండి
రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీక్షావిధానం ఉండాలన్న ది కేంద్రం నిర్ణయంగా కనిపిస్తున్నది.
- రాష్ట్ర విద్యాశాఖకు కేంద్ర విద్యాశాఖ ఆదేశం
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీక్షావిధానం ఉండాలన్న ది కేంద్రం నిర్ణయంగా కనిపిస్తున్నది. ఇటీవల ఢిల్లీలో కేంద్రవిద్యాశాఖ అన్ని రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా, పాఠశాల విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో రెండు బోర్డులుండటంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తంచేసింది.
రెండుబోర్డులను విలీనం చేయాలని సూచించగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో పదో తరగతి వరకు పాఠశాల విద్య, 11, 12 తరగతులను ఇంటర్‌బోర్డు నిర్వహిస్తున్నాయి. 8 రాష్ర్టా ల్లో ఒకలా.. సీబీఎస్ఈ సహా 21 రాష్ర్టా ల్లో మరోలా ఉండటంతో, 8 రాష్ర్టాలను కేంద్రం దారికి తెచ్చుకునే పనిలో పడింది. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్స్ రద్దు చేయడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. 100 మార్కులకు పరీక్షలను ఎలా నిర్వహిస్తారని నిలదీసింది. వొకేషనల్ కోర్సులకు సర్టిఫికెట్లు ఇస్తున్న తీరు సవ్యంగా లేదని కేంద్ర విద్యాశాఖ చెప్పినట్టు సమాచారం.
ఇంటర్ విలీనం తప్పదా..
తాజా పరిస్థితులు చూస్తుంటే ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. బుధవారం విద్యాశాఖపై రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే విషయంపై తీవ్ర చర్చ జరిగింది. 9-12 తరగతులు ఒకే దగ్గర నిర్వహించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం విద్యాశాఖ ఆదేశాల తర్వాతే సీఎం సమీక్షించడం, విలీనానికే రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ నడుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

