హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధిశాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి (సీడీపీవో)గా పనిచేస్తున్న అనిశెట్టి శ్రీదేవిని బుధవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరు సీపీడీవోగా పనిచేసినప్పుడు నిధులు దుర్వినియోగం చేసినట్టు అధికారులు గుర్తించారు.
ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా కోసం చేసిన ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్టు దర్యాప్తులో తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. మొత్తం రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించారని వెల్లడించారు. ఆమెను కరీంనగర్ కోర్టులో హాజరుపర్చిన ఏసీబీ అధికారులు అనంతరం రిమాండ్కు తరలించారు.