కౌకుంట్ల(చిన్న చింతకుంట), ఏప్రిల్ 22 : మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన బసిరెడ్డి సంతోష్‌రెడ్డి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతోపాటు వివిధ సమస్యలపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని ప్రశ్నిస్తూ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టుచేశారు. ఈ పోస్టులపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి చిన్నచింతకుంట పోలీసులకు 21న ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంతోష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంతోష్‌రెడ్డిపై గతంలో 10 కేసులు ఉన్నందున అరెస్టు చేసినట్టు ఎస్సై కృష్ణ ఓబుల్‌రెడ్డి వెల్లడించారు. ఆయన్ను బుధవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.