సాంకేతికతతో సృజనాత్మకత తగ్గదు
‘సంప్రదాయ కార్టూనిస్టు ఓ కాగితం మీద బొమ్మగీసి ప్రచురణకు పంపించే వారు.. ఇది గంటల సమయం పట్టేది.. ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనే కార్టూన్లు గీయవచ్చు’ అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ అన్నారు.
- కార్టూనిస్టులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
- నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ
ఖైరతాబాద్, జూన్ 30: ‘సంప్రదాయ కార్టూనిస్టు ఓ కాగితం మీద బొమ్మగీసి ప్రచురణకు పంపించే వారు.. ఇది గంటల సమయం పట్టేది.. ఇప్పుడు పదిహేను నిమిషాల్లోనే కార్టూన్లు గీయవచ్చు’ అని నమస్తే తెలంగాణ కార్టూనిస్టు మృత్యుంజయ అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ సౌజన్యంతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు కార్టూనిస్ట్స్ మెగా వర్క్‌షాప్‌ను ప్రముఖ కార్టూనిస్టులు హరికృష్ణ, రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మృత్యుంజయ మాట్లాడుతూ ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్ పాఠకులకు వెళ్లాలంటే రెండు రోజులు పట్టేదని, నేడు వార్తలతో పాటు ఉత్తమమైన, సృజనాత్మకమైన కార్టూన్లనూ పాఠకులకు అందించవచ్చని అన్నారు. 2018లోనే ఫొటోషాప్‌లో కార్టూన్లు గీయడంపై తాను బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు వర్క్‌షాప్‌లో డెమో ఇచ్చినట్టు గుర్తు చేశారు.
ఐప్యాడ్‌లో ప్రొక్రియేట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని డిజిటల్ కార్టూన్లు వేయవచ్చని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల వార్తలతో సమానంగా కార్టూన్లు పాఠకులకు చేర్చవచ్చని తెలిపారు. ట్రెడిషనల్ ఆర్ట్‌కు ఓ సెటప్ అవసరమని, కూర్చొని బొమ్మగీస్తారని, ఐప్యాడ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా బొమ్మలు గీసి పంపించే వెసులుబాటు కలిగిందని చెప్పారు.
కార్టూన్ల విషయంలో సాంకేతికత అనేది ఒక టూల్ టెక్నిక్ మాత్రమేనని, ఇందులో కార్టూనిస్టు సృజనాత్మకత ఏ మాత్రం తగ్గదని పేర్కొన్నారు. టెక్నికల్, ట్రెడిషనల్ ఆర్ట్ మీద 80 మంది ఇంటర్నేషనల్ కార్టూనిస్టులను ఇంటర్వ్యూలు చేసి పుస్తకాన్ని తేచ్చే ప్రయత్నంలో ఉన్నానని తెలిపారు. ఇప్పటికే 40 వ్యాసాలు నమస్తే తెలంగాణలో అచ్చయ్యాయని, మరో 40 వ్యాసాలు రాసి పుస్తకాన్ని తీసుకువస్తానని తెలిపారు.
అనంతరం ప్రొక్రియేట్ ద్వారా పొలిటికల్ కార్టూన్స్, అదే పొలిటికల్ కార్టూన్ యానిమేషన్ డెమో ప్రదర్శించారు. దక్కన్ క్రానికల్ కార్టూనిస్టు సుభానీ సోషల్, పొలిటికల్ కార్టూన్ల అంశంపై మాట్లాడారు. కార్టూన్లు వాటర్, పోస్టర్ కలర్స్‌తో షేడింగ్, డెప్త్ చూపించడం ఎలా అంశంపై కార్టూనిస్టు టీవీ, కార్టూన్ సిండికేషన్, ఉపయోగం, పనివిధానంపై కార్టూనిస్టు నర్సిం, కార్టూన్‌కు బొమ్మ లేక కాన్సెప్ట్ ముఖ్యమా, సైలెంట్ కార్టూన్ తదితర అంశాలపై కార్టూనిస్టు సురేంద్ర, క్యారికేచర్‌పై సాక్షి కార్టునిస్టు శంకర్, యూత్ కార్టూన్స్పై కార్టూనిస్టు శంకు వివరించారు.
అనంతరం ప్రముఖ యోగా ట్రైనర్ ఏ సంగీత అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్టూన్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా యోగాకు సంబంధించిన కార్టూన్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

