కేబుల్ చానల్ జర్నలిస్ట్‌లకు అక్రెడిటేషన్లు ఇవ్వాలి
కేబుల్ చానల్ జర్నలిస్ట్‌లకు అక్రెడిటేషన్లు ఇచ్చేదాకా పోరాడుతామని జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పష్టంచేశారు. కొత్త జీవోలో కేబుల్ చానళ్లకు అక్రెడిటేషన్లను పూర్తిగా తొలగించడాన్ని నిరసిస్తూ కేబుల్ చానళ్ల జర్నలిస్ట్‌ల జేఏసీ, జర్నలిస్ట్ సంఘాల నేతలు మంగళవారం ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
- జర్నలిస్ట్ సంఘాల నేతల డిమాండ్ ఐఅండ్‌పీఆర్ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : కేబుల్ చానల్ జర్నలిస్ట్‌లకు అక్రెడిటేషన్లు ఇచ్చేదాకా పోరాడుతామని జర్నలిస్ట్ సంఘాల నేతలు స్పష్టంచేశారు. కొత్త జీవోలో కేబుల్ చానళ్లకు అక్రెడిటేషన్లను పూర్తిగా తొలగించడాన్ని నిరసిస్తూ కేబుల్ చానళ్ల జర్నలిస్ట్‌ల జేఏసీ, జర్నలిస్ట్ సంఘాల నేతలు మంగళవారం ఐఅండ్‌పీఆర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ మాట్లాతూ గత ప్రభుత్వ హయాంలో జీవో 239 ప్రకారం కేబుల్ చానళ్లకు అక్రెడిటేషన్లు ఇచ్చిన విధంగా హైదరాబాద్‌లో ఐఅండ్‌పీఆర్ ద్వారా 12, ప్రసారాలు జరిగే జిల్లాల్లో 4 అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే డిమాండ్ చేశారు.
టెలివిజన్ రంగంలో కేబుల్ చానళ్లది కీలకపాత్ర అని, వారికి అక్రెడిటేషన్లు తొలగించడం శోచనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 23 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తే ఇప్పుడు వాటి సంఖ్యను 10 వేలకు పరిమితం చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెంజూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, కేబుల్ చానల్స్ జేఏసీ నేతలు సత్యనారాయణ, వెంకటేశ్, భరత్, చలపతి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

