BRS South Africa | పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడమేమిటని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని పేర్కొన్నారు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పారు. చట్టపరంగా న్యాయస్థానాల్లోనూ పోరాడతామన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని గుర్రాల నాగరాజు చెప్పారు., పోరాటాలు , ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీ కి కొత్త ఏమి కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదుర్కోలేక ఈ రకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.