KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మరోసారి గ్లోబల్ వేదికపై ఆయన స్వరాన్ని వినిపించనున్నారు.
కొలంబియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న బిజినెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ పాల్గొననున్నారు. కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ -2026లో ప్రసంగించనున్నారు. కేటీఆర్ పర్యటనతో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు మెరుగపడవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను తెలంగాణకు పరిచయం చేసే బ్రాండ్ అంబాసిడర్గా కీలక పాత్ర పోషించారు.
వారం రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ కొలంబియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న “కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్” 2026లో ప్రసంగించనున్నారు