KTR | తెలుగు సాహితీ వినీలాకాశంలో సినారె ఒక ధృవతార : కేటీఆర్
KTR | కవి, సాహితీవేత్త, సినీ గేయ రచయిత సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.
KTR | హైదరాబాద్ : కవి, సాహితీవేత్త, సినీ గేయ రచయిత సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. కవితలు, పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, గజల్లు, వ్యాసాలు, సినిమా పాటలు… రూపం ఏదైనా సినారె కలానికి తిరుగులేదు అని కేటీఆర్ కొనియాడారు.
కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీ గేయ రచయిత… పాత్ర ఏదైనా సినారె ప్రతిభకు సాటిలేదు. ప్రపంచ సాహితీ లోకానికి మన తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యం సింగిరెడ్డి నారాయణ రెడ్డి. తన పాండిత్యంతో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన సినారె.. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ధృవతార అని కొనియాడారు.
తన రచనలతో తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త బాణీని సృష్టించిన సినారె పాటల పూదోట. జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వారిని వరించినా, రాజ్యసభ ఎంపీతో పాటు ఎన్నో గొప్ప పదవులను వారు అలకరించినా.. ఇవన్నీ సినారె సాహితీ సేవ ముందు దిగదుడుపే. నేడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- C Narayana Reddy
- CNR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

