KTR | ఈడీ అధికారుల తీరుపై మండిపడ్డ కేటీఆర్.. ‘ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టా’ అని ఆగ్రహం.. Video
KTR | ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన ఈడీ అధికారులను నిలదీశారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఆ మాట తప్పుతారని ప్రశ్నించారు.
KTR : ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన ఈడీ అధికారులను నిలదీశారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఆ మాట తప్పుతారని ప్రశ్నించారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన మాటను మీరు అరెస్ట్ చేస్తే న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుంటారని కేటీఆర్ హెచ్చరించారు. సెర్చ్ వారెంట్ ఇచ్చి సోదాలు పూర్తిచేశామని, అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నామని ఈడీ అధికారిణి భానుప్రియ మీనా మేడమ్ చెబుతున్నారని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన మండిపడ్డారు.
ఈడీ అధికారులు కావాలనే శుక్రవారం వచ్చి అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సోదాలు పూర్తయిన తర్వాత కూడా కుటుంబసభ్యులు ఇంట్లోకి రావద్దని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని ఆయన చెప్పారు. మా లాయర్‌ను కూడా లోనికి అనుమతించడం లేదని విమర్శించారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా పక్కనే ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

