BRS Silver Jublee Celebrations | డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు.. పోస్టర్ విడుదల
BRS Silver Jublee Celebrations | జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు.
BRS Silver Jublee Celebrations | హైదరాబాద్ : జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, నాయకులు చందుతాళ్ల, రంగినేని అభిలాష్ రావు, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలను విదేశాల్లో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమెరికాలో జూన్ 1న తేదీన డల్లాస్లో సభ నిర్వహిస్తున్నాం. అమెరికాలో జరిగే సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. డల్లాస్ నగరం అంటే కేసీఆర్కు ఇష్టం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డల్లాస్లో నిర్వహించే సభలో పాల్గొనేందుకు తెలంగాణ, తెలుగు ఎన్ఆర్ఐలు పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని మహేశ్ బిగాల తెలిపారు.
అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు, తెలుగు వారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో అనేక అద్భుతాలు జరిగాయి. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. ఎన్ఆర్ఐలుగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామం. జూన్ 1న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు డల్లాస్లో జరగబోతున్నాయి. డల్లాస్లో జరిగే కార్యక్రమంలో తెలంగాణ, తెలుగు ప్రజలు పాల్గొనాలి. అమెరికాతో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

