జహీరాబాద్, మార్చి 1 : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఎంపీ బీబీ పాటిల్ 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీచేసి ఎంపీగా గెలుపొందారు.