దానం నాగేందర్ వెంటనే రాజీనామా చేయాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్
ఎమ్మెల్యేలను శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసభ్యపదజాలంతో దూషించడం పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం ఉంటే దానం నాగేందర్ రాజీనామా చేయాలని కోవా లక్ష్మి డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలను శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసభ్యపదజాలంతో దూషించడం పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు, శరం ఉంటే దానం నాగేందర్ రాజీనామా చేయాలని కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. ఇవాళ శాసన సభలో దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉన్నదని మండిపడ్డారు. నిన్న స్పీకర్ తమకు చాలా నీతులు చెప్పారని.. ఇవాళ దానం నాగేందర్‌పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని అన్నారు. దానం నాగేందర్‌పై యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు.
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నాయకులు రెండు రోజుల నుంచి అవమానకరంగా మాట్లాడుతున్నారని కోవా లక్ష్మి తెలిపారు. నిన్న మహిళలను అవమానించారని.. ఇవాళ దానం నాగేందర్ అసభ్యంగా మాట్లాడరని పేర్కొన్నారు. రూ.25 కోట్లతో కేసీఆర్ జోడేఘాట్‌ను అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అవగాహన లేకుండా జోడేఘాట్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కే ఫామ్‌హౌస్ ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేవా అని ప్రశ్నించారు.
దానం నాగేందర్‌కు సిగ్గు శరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ అంటే దేవాలయమని.. అలాంటి దేవాలయంలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

